ఐక్యతకు ప్రతీక వందేమాతరం
భీమవరం (ప్రకాశంచౌక్): ఐక్యతకు ప్రతీక వందేమాతరం అని, దేశభక్తి నినాదమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. వందేమాతం గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే, పులపర్తి రామాంజనేయులు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, పోలీసు అధికారులు, ప్రజలు, విద్యార్థులు కలిసి ఏకస్వరంగా వందేమాతరం ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ గీతం స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లాది భారతీ యుల్లో ఆత్మవిశ్వాసాన్ని, త్యాగస్ఫూర్తిని నింపిందన్నారు. వందేమాతరం స్ఫూర్తితో దేశ ఐక్యతకు పా టుపడాలన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు, ఎస్పీ నయీం అస్మి మాట్లాడారు. ఆర్డీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డీఈఓ ఈ.నారాయణ, డీఎంహెచ్‌ఓ బి.గీతా బాయి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు తదితరులు పాల్గొన్నారు.
క్యాన్సర్‌పై అవగాహన : ముందస్తు స్క్రీనింగ్ పరీక్షల ద్వారా నూరు శాతం క్యాన్సర్‌ను నిరోధించవచ్చని కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పరిస్కరించు కుని శుక్రవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ నుంచి ప్రకాశం చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
కలెక్టర్ నాగరాణి


