కళా ఉత్సవంలో ఏకలవ్య విద్యార్థుల ప్రతిభ
బుట్టాయగూడెం: రాష్ట్రస్థాయి ఉద్భవ్–2025 కల్చరర్ అండ్ లిటరరీ ఫెస్ట్ కళా ఉత్సవంలో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చారని స్థానిక ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్ మిశ్రా తెలిపారు. మారేడుమిల్లిలో 3 రోజులపాటు ఏకలవ్య పాఠశాలల కళా ఉత్సవం జరిగిందని, తమ విద్యార్థులు పతకాలు సాధించారన్నారు. క్లాసికల్ సోలో డ్యాన్స్ సీనియర్ విభాగంలో యు.సాయినవదీప్ ద్వితీయ స్థానం, స్టోరీ టెల్లింగ్ హిందీ జూనియర్స్ విభాగంలో బి.గీతిక మొదటిస్థానం, స్టోరీ టెల్లింగ్ ఇంగ్లీష్ జూనియర్స్ విభాగంలో ఎం.ఖ్యాతిశ్రీ మొదటిస్థానం, ఇంగ్లీష్ పోయమ్ రెసిటేషన్ జూనియర్ విభాగంలో కె.మోర్విన్ రాజు మొదటిస్థానం, సాన్‌స్క్రిట్ జూనియర్స్ విభాగంలో కె.నాగవెంకటసాయి నాయక్ మొదటి స్థానంలో గెలుపొందినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు వీఎస్‌ఎస్ రాజు, ఎం.హరికృష్ణ, సుమతి, గౌరవ్ పాల్గొన్నట్టు చెప్పారు.


