కేదారీ ఘాట్‌ రేవులకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

కేదారీ ఘాట్‌ రేవులకు మోక్షం

Oct 22 2025 9:21 AM | Updated on Oct 22 2025 9:21 AM

కేదార

కేదారీ ఘాట్‌ రేవులకు మోక్షం

కేదారీ ఘాట్‌ రేవులకు మోక్షం దళిత బాలుడిపై దాడి.. కేసు నమోదు గాలివాన బీభత్సం ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ చేయాలి

పెనుగొండ: కార్తీక మాసం సమీపిస్తుండడంతో కేదారీఘాట్‌ రేవుల దుస్థితిపై సాక్షిలో ప్రచురితమైన కథనానికి పంచాయతీ, దేవదాయ శాఖాధికారులు స్పందించారు. అధ్వానంగా మారిన సిద్ధాంతం కేదారీఘాట్‌ రేవులను పంచాయతీ, దేవదాయ శాఖల ఆధ్యర్యంలో శుభ్రం చేశారు. సర్పంచ్‌ చింతపల్లి గనిరాజు(చంటి), దేవస్థానం అధికారి ముత్యాల సత్యనారాయణల ఆధ్వర్యంలో రేవుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు,

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో దళిత బాలుడు బేతాళ నాగచైతన్యను కులం పేరుతో దూషించి, దాడి చేసి గాయపర్చిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నాగచైతన్య ఈ నెల 5న దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపు జరుగుతుండగా చూసేందుకు వెళ్లాడు. ఊరేగింపు నిర్వాహకులు బాలుడిని కులంపేరుతో దూషించి గాయపర్చారు. ఈ ఘటనకు సంబంధించి నులకాని రామచంద్‌, సారేపల్లి ధర్మరాజు, కోటపోతుల పవన్‌, వనుముల సాయిలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆ రోజున బాలుడి తరుపున ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఈ నెల 17న నాగ చైతన్యకు కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి అక్కడి నుంచి స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, పాంక్రియాస్‌ దెబ్బతిందని నిర్ధారించి విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బాలుడి తండ్రి గంగాధర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదుపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తానని డీఎస్పీ తెలిపారు.

ముదినేపల్లి రూరల్‌: మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉదయం 12 గంటల వరకు ఎండ కాయగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి గాలివాన రావడంతో ప్రజలు ఆందోళన చెందారు. పలుగ్రామాల్లో గాలివానకు విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. గాలి బీభత్సానికి కాకరవాడలో ఒక ఇంటిపై కొబ్బరి చెట్టు కూలిపోయింది. గంటన్నరకు పైగా కుండపోతగా వర్షం కురియడంతో ముదినేపల్లి సెంటర్‌ జలమయంగా మారింది.

ఏలూరు (టూటౌన్‌): దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ దివ్యాంగుల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ సమావేశం మంగళవారం ఏలూరులో జరిగింది. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్‌ కె వీర్రాజు, అధ్యక్షుడు కుందేటి జయరాజు, కార్యదర్శి ఎల్‌.రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇళ్ల వద్దకే రేషన్‌ అందించాలని చెప్పినప్పటికీ, చాలాచోట్ల రేషన్‌ అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు పంపిణీ అందించేవారని గుర్తు చేశారు. సమావేశంలో ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి లక్కపాము రాంబాబు, ఉపాధ్యక్షుడు సీహెచ్‌ వాసు, కోశాధికారి భూలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

కేదారీ ఘాట్‌ రేవులకు మోక్షం 1
1/3

కేదారీ ఘాట్‌ రేవులకు మోక్షం

కేదారీ ఘాట్‌ రేవులకు మోక్షం 2
2/3

కేదారీ ఘాట్‌ రేవులకు మోక్షం

కేదారీ ఘాట్‌ రేవులకు మోక్షం 3
3/3

కేదారీ ఘాట్‌ రేవులకు మోక్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement