
18 నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు
భీమవరం: విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన, ప్రశ్నించే తత్వం, శాసీ్త్రయ దృక్పథాన్ని చెకుముకి సైన్స్ సంబరాలు పెంపొందిస్తాయని జిల్లా విద్యాశాఖాధికారి ఇ నారాయణ అన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాలు పోస్టర్‌ను బుధవారం డీఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువమంది విద్యార్థులు సైన్స్ సంబరాల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. చెకుముకి జిల్లా కన్వీనర్ రేపాక వెంకన్నబాబు మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన పాఠశాల, నవంబర్ 1న మండల, నవంబర్ 23న జిల్లా స్థాయిలోను డిసెంబర్ 12,13,14 తేదీల్లో రాష్ట్రస్థాయిలోనూ చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణ, డీసీఈబీ సెక్రటరీ జీవీవీ శ్రీనివాస్, కుమారస్వామి, జనవిజ్ఞానవేదిక గౌరవ సలహాదారు ప్రత్తి వీరాస్వామి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జామాను రామలక్ష్మణరావు, మల్లుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.