
సాంకేతికతతో నేరస్తులపై నిఘా
ఐజీ అశోక్‌కుమార్
భీమవరం: ఆధునిక సాంకేతికతో పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టి, నేర నియంత్రణకు కృషి చేయాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. గురువారం స్థానిక విష్ణు కళాశాలలో అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ నాగరాణితో కలిసి ఐజీ అశోక్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నెలాఖరు వరకు జిల్లాలో జరిగిన నేరాలు, ప్రమాదాలు, కేసులపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. నేరాలను తగ్గించడానికి అనుసరించాల్సిన విధివిధానాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ నేరాల నియంత్రణలో రాష్ట్రస్థాయిలో జిల్లా పోలీసు శాఖ ప్రథమ బహుమతిని అందుకోవడం గర్వకారణమన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఓపెన్ డ్రింకింగ్‌ను అరికట్టడానికి కృషి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి మాట్లాడుతూ సాంకేతికత ఆధారిత పోలీసింగ్ తో జిల్లాలో నేరాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. పీ4 కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నా రు. గంజాయి అక్రమ రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టడానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లా అదనపు ఎస్పీ వి.భీమారావు, ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆర్‌ఎస్ కుమారేశ్వరన్, డీఎంహెచ్‌ఓ జి.గీతా భాయ్, డీటీఓ టి.ఉమా మహేశ్వర రావు, ఎఫ్‌ఎస్‌ఎల్ అడిషనల్ డైరెక్టర్ ఫణి భూషణ్, డీఈఓ నారాయణ పాల్గొన్నారు.