
వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా షాన్‌వాజ్‌ఖ
నరసాపురం: వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నరసాపురం పట్టణానికి చెందిన ఎండీ షాన్‌వాజ్‌ఖాన్‌ను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఈ మేరకు గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. షాన్‌వాజ్‌ఖాన్ దీర్ఘకాలంగా వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఆయన గతంలో వామపక్ష పార్టీల్లోను, వామపక్ష అనుబంధ కార్మిక సంఘాల్లోను పనిచేసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఔన్జీసీ కార్మిక యూనియన్‌లో కూడా పదేళ్లపాటు పనిచేశారు. తరువాత కాంగ్రెస్‌లో చేరగా వైఎస్సార్‌సీపీ అవిర్భావంలోనే పార్టీలో చేరి అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు. తనకు రాష్ట్రస్థాయి పదవి లభించడంపై పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.
వైఎస్సార్ సీపీ క్రిష్టియన్ మైనారిటీ సెల్
సంయుక్త కార్యదర్శిగా డేవిడ్ రాజు
పెనుగొండ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రిష్టియన్ మైనారిటీ సెల్ సంయుక్త కార్యదర్శికి ఆచంట నియోజకవర్గానికి చెందిన బి డేవిడ్ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కొడమంచిలికి చెందిన డేవిడ్‌రాజు నియామకంపై వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు ప్రజాప్రతినిధులు అభినందలు తెలిపారు.

వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా షాన్‌వాజ్‌ఖ