
గురుకుల విద్యార్థులకు ర్యాంకులు
తాడేపల్లిగూడెం రూరల్: సైన్స్, ఒలంపియాడ్ ఫౌండేషన్ పరీక్షలో పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సాంఘీక, సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ బి.రాజారావు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం గురుకుల పాఠశాల ఆవరణలో అభినందన సభ నిర్వహించారు. ప్రిన్సిపాల్ రాజారావు మాట్లాడుతూ సైన్స్, ఒలంపియాడ్‌లో ప్రపంచ వ్యాప్తంగా 72 దేశాలకు చెందిన 92,499 విద్యార్థులు పాల్గొన్నారని, వీరిలో 158 మంది గురుకుల విద్యార్థులు ఉన్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో గురుకులంనకు చెందిన సీహెచ్. సాహస్ హిందీలో 131వ ర్యాంకు, డి.హర్షవర్ధన్ హిందీలో 150వ ర్యాంకు, ఎ.పాల్సన్ హిందీలో 149వ ర్యాంకు, జి.హర్షవర్ధన్ హిందీలో 176వ ర్యాంకు, టి.మురళీ గణితంలో 1210వ ర్యాంకులు సాధించారన్నారు. అనంతరం విద్యార్థులను అభినందిస్తూ సర్టిఫికెట్లు అందజేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.