
ట్రాక్టర్‌ను ఢీకొన్న వ్యాన్.. ఒకరు మృతి
తాడేపల్లిగూడెం రూరల్ : ట్రాక్టర్‌ను వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన పెదతాడేపల్లి జాతీయ రహదారి నెం.16పై బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ద్వారకాతిరుమల మండలం కోడిగూడెం గ్రామానికి చెందిన దిర్శిపాము శ్రీను (40) కోడిపెంట కోసం ట్రాక్టర్‌పై తణుకు వెళ్తుండగా, చిత్తూరు జిల్లా బంగారుపాలెం నుంచి మామిడికాయ లోడుతో వస్తున్న వ్యాన్ ఢీకొంది. శ్రీను తన ట్రాక్టర్‌ను ఒక్కసారిగా ఎడమ వైపు నుంచి కుడివైపునకు తిప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు వ్యాన్ డ్రైవర్ హరీష్ తెలిపారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీను ఇంజన్ చక్రం కింద పడి మృతి చెందగా, వ్యాన్ డ్రైవర్ పనిగంటి హరీష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరొకరికి గాయాలు

ట్రాక్టర్‌ను ఢీకొన్న వ్యాన్.. ఒకరు మృతి