
నారుమడిని సంరక్షించుకోవాలి
ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నారుమడులకు నష్టం వాటిల్లకుండా సంరక్షణ చర్యలు చేపట్టాలని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం శాస్త్రవేత్త ఎంవీ కృష్ణాజీ తెలిపారు. లీటరు నీటికి 10 గ్రాముల యూరియా చొప్పున ఎకరా నారుమడికి పది లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలని లేదా లీటరు నీటికి మల్టీకే (13045) 10 గ్రాములు చొప్పున పది లీటర్ల ద్రావణాన్ని పిచికారి చేయొచ్చన్నారు. దీని వల్ల 10 నుంచి 15 రోజుల పాటు నారుమడి దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇనప ధాతువు లోపం వచ్చే అవకాశం ఉందని, దీని నివారణకు ఫెరరస్ సల్ఫేట్ 10 గ్రాములు, నిమ్మ ఉప్పు 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేయాలన్నారు.