
వైభవంగా సువర్చలా హనుమద్ కల్యాణం
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం సువర్చలా హనుమద్ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. పూర్వాభాద్రా నక్షత్రం పురస్కరించుకుని మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ అష్టోత్తర మండపంపై శ్రీ సువర్చలా హనుమద్ కల్యాణ క్రతువు వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని వీక్షించి తరించారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవలు, విరాళాల రూపంలో రూ.1,83,399 సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు.
సారా స్థావరంపై ఎకై ్సజ్ దాడులు
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెం సమీపంలో సారా తయారీ స్థావరంపై మంగళవారం ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామని, 5 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనుబాబు తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా సువర్చలా హనుమద్ కల్యాణం