
అర్జీలను వేగంగా పరిష్కరించాలి
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని, నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని..
● పాలకోడేరుకు చెందిన తొంట రాజమణి తనకు తల్లికి వందనం ఇప్పించాలని అర్జీ అందించారు.
● పెనుగొండ మండలం పితానివారిపాలేనికి చెందిన వేండ్ర మోహన్‌రావు అనారోగ్య కారణంతో కాలు తొలగించారని సామాజిక పింఛన్ సొమ్ము పెంచాలని కోరారు.
● ఆచంటకి చెందిన కె.సాల్మన్‌రాజు తన పాస్‌బుక్ లో 27 సెంట్ల భూమి చూపుతుండగా సర్వేలో 25 సెంట్లు మాత్రమే ఉందని, మిగిలిన రెండు సెంట్లు అప్పగించాలని కోరారు.
● పాలకొల్లులోని 13వ వార్డుకు చెందిన వానపల్లి జేబీ రామ్ సిద్ధార్థ తనకు మానసిక వికలాంగుల పింఛన్ ఇప్పించాలని దరఖాస్తు అందించారు.
జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి