
స్మార్ట్ మీటర్లతో ప్రజలపై భారం
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): విద్యుత్ స్మార్ట్‌మీటర్ల నిర్ణ యాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోకపోతే బషీర్‌బాగ్ విద్యుత్ పోరాట అమరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అన్నారు. సోమవారం సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. స్మార్ట్‌మీటర్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేయొద్దని నినదించారు. నాడు ప్రతిపక్ష నేతగా నారా లోకేష్ స్మార్ట్‌మీటర్లను వ్యతిరేకించారని.. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటినే కొనసాగించేలా చూస్తుండటం దారుణమన్నారు. సీపీఎం నగర కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్, వైఎస్ కనకారావు, ఎం.ఇస్సాక్, పి.ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.