కూటమి అరాచక పాలనపై పోరాడుదాం | - | Sakshi
Sakshi News home page

కూటమి అరాచక పాలనపై పోరాడుదాం

Jul 13 2025 4:31 AM | Updated on Jul 13 2025 4:31 AM

కూటమి

కూటమి అరాచక పాలనపై పోరాడుదాం

పాలకొల్లు సెంట్రల్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, సుపరిపాలన.. ఇది మంచి ప్రభుత్వం అంటూ వారి డప్పు వారే కొట్టుకుంటూ పగటి వేషగాళ్లలా నాయకులు డ్రామాలా డుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ము దునూరి ప్రసాదరాజు విమర్శించారు. శనివారం స్థానిక లయన్స్‌ కమ్యూనిటీ హాల్‌లో వైఎస్సార్‌సీపీ పాలకొల్లు నియోజకవర్గ సమావేశాన్ని ఇన్‌చార్జి గు డాల శ్రీహరిగోపాలరావు (గోపి) అధ్యక్షతను నిర్వహించారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ముదునూరి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై సుమారు 4,500 కేసులు బనాయించారని మండిపడ్డారు. కూటమి దుర్మార్గపు పాలనను ఎండగట్టేలా పోరాటం చేస్తామన్నారు. గత ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికీ బాబు ష్యూరిటీ–పవన్‌ గ్యారంటీ అంటూ బాండ్లు అందించారని, ఈ మేరకు ఏడాది పాలనలో చేకూరిన లబ్ధిపై ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇస్తే గాలికి వదిలేసినట్టేనని ఎద్దేవాచేశారు. ఉచిత బస్సు ప్రయాణానికి గ్యారంటీ లేదని, రైతులకు పెట్టుబడి సాయం, యువతకు నిరుద్యో గ భృతి లేదా 20 లక్షల ఉద్యోగాలు, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500, ఏడాదికి మూ డు గ్యాస్‌ సిలిండర్‌ హామీలు ఏమయ్యాయని ప్ర శ్నించారు. 50 ఏళ్లకే బీలకు పెన్షన్‌ హామీని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కూటమి నేతలకు దమ్ముంటే మెడికల్‌ కళాశాలను అభివృద్ధి చే యాలని అన్నారు. ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, కేసులకు అదిరేది, బెదిరేది లేదని ముదునూరి భరోసా ఇచ్చారు.

జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం

నరసాపురం పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ గుడూరి ఉమాబాల మాట్లాడుతూ పార్టీలో చిన్నపాటి సమస్యలుంటే సర్దుకుపోవాలని, అందరి లక్ష్యం జగన్‌ ను మరోమారు ముఖ్యమంత్రి చేయడం కోసమే అనే ఆలోచనా విధానం ఉండాలన్నారు.

ఇది మోసపూరిత ప్రభుత్వం

ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అని డప్పు కొట్టుకుంటూ టీడీపీ నాయకులు తిరగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మంచి ప్రభుత్వమో మోసపూరిత ప్రభుత్వమో ప్రజలు చెప్పాలని అన్నారు. పేదవాడు కనిపిస్తే దోచుకునే విధానం కూటమి నేతలదని అదే పేదవాడు కనిపిస్తే భోజనం పెట్టే గుణం జగన్‌ది అని అన్నారు.

సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ ఫ్లాప్‌

నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గుడాల శ్రీహరిగోపాలరావు మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ సూపర్‌ ఫ్లాప్‌ అయ్యిందన్నారు. బాబు పవన్‌ల పరిస్థితి ఎలా ఉందంటే బాబు బుడగను చూపించి ఇది సంచి అంటే ప్రశ్నించే తత్వం మర్చిపోయిన పవన్‌ అవును ఇది సంచేననే దుస్థితిలో ఉన్నారన్నారు. ముందుగా వైఎస్సార్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉమాబాల జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ ఇన్‌చార్జి చినమిల్లి వెంకట్రాయుడు, సీనియర్‌ నాయకులు గుణ్ణం నాగబాబు, చెల్లెం ఆనందప్రకాష్‌, కుమారదత్తాత్రేయ వర్మ, యడ్ల తాతాజీ, జెడ్పీటీసీలు నడపన గోవిందరాజులు నాయుడు, గుంటూరి పెద్దిరాజు, ఎంపీపీలు యినకొండ ధనలక్ష్మి, సబితి సుమంగళి, కర్రా జయసరిత, జిల్లా యూత్‌ అధ్యక్షుడు సందీప్‌, జిల్లా ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు బండి రమేష్‌, జిల్లా వీవర్స్‌ అధ్యక్షుడు వీరా మల్లికార్జునుడు, పట్టణ, మండల అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, ఉచ్చుల స్టాలిన్‌, పెన్మెత్స ఏసురాజు, కొర్రపాటి వీరాస్వామి, గుమ్మాపు పెద్దిరాజు, కవురు గోపి, గొల్లపల్లి శ్రీనివాస్‌, మద్దా చంద్రకళ, సునీల్‌, గుబ్బల సత్యనారాయణ, సాలా నర్సయ్య, విన్‌స్టన్‌బాబు, ఖండవల్లి వాసు, మైలాబత్తుల మైఖేల్‌రాజు, మామిడి బాబు, రావూరి బుజ్జి, బోణం బులివెంకన్న, పెదపాటి పెద్దిరాజు, పాలపర్తి సందీప్‌, పెచ్చెట్టి కృష్ణాజి, పెండ్ర వీరన్న, శంకరాపు శ్రీను, కడలి ఏడుకొండలు పాల్గొన్నారు.

సూపర్‌సిక్స్‌ హామీలపై నిలదీయండి

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి

కూటమి అరాచక పాలనపై పోరాడుదాం 1
1/1

కూటమి అరాచక పాలనపై పోరాడుదాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement