
మొక్కుబడి తంతు
భార్య దారుణ హత్య
ఆస్తిని పెద్ద కొడుక్కి రాసివ్వమని అడిగిన భార్యను భర్త అంతమొందించిన ఘటన కలిదిండి మండలం ఎస్‌ఆర్‌పీ అగ్రహారంలో చోటుచేసుకుంది. 8లో u
కూటమి మోసాలను ఎండగడదాం
శురకవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి, భీమవరం: పండుగ వాతావరణంలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ (పీటీఎం) అంటూ కూటమి ప్రభుత్వం చేసిన హడావుడి ప్రచార ఆర్భాటమే అయ్యింది. మాకెందుకీ ఖర్చన్న ధోరణీలో ప్రైవేట్ విద్యాసంస్థలు మమా అనిపించగా, చాలాచోట్ల ఎంపీపీ, ప్రైమరీ పాఠశాలల్లో మొక్కుబడి తంతుగానే సమావేశాలు సాగాయి. తల్లిదండ్రుల హాజరు అంతంతమాత్రమే కావడంతో సమావేశాలు వెలవెలబోయాయి.
1,920 పాఠశాలలు.. 121 జూనియర్ కాలేజీలు
పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు పేరిట గురువారం పీటీఎం నిర్వహణకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. జిల్లాలోని 1,920 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన 2,79,204 మంది, 121 జూనియర్ కళాశాలల్లోని 37,124 విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నది లక్ష్యం. విద్యార్థుల సంఖ్యను బట్టి ఇటీవల సమగ్ర శిక్ష నుంచి పాఠశాలలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు కాంపొజిట్ గ్రాంట్ విడుదల కాగా ఈ మొత్తం నుంచి 20 శాతం నిధులను పీటీఎంల నిర్వహణకు వెచ్చించేందుకు ఎస్‌ఎస్ పీడీ ఆదేశాలిచ్చారు.
అరకొర కేటాయింపులు : అరకొర కేటాయింపులతో చాలాచోట్ల మొక్కుబడిగానే కార్యక్రమాలు జరిగాయి. పాలకోడేరు మండలం వేండ్ర హైస్కూల్‌లో ఉదయం తొమ్మిది గంటలకు మొదలుకావాల్సిన జిల్లాస్థాయి మెగా పీటీఎం పేరెంట్స్ లేకపోవడం వలన ఉదయం 11 గంటలకు కూడా మొదలవ్వక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. త్వరగా హాజరుకావాలని పేరెంట్స్‌కు ఉపాధ్యాయులు ఫోన్లు చేయాల్సి వచ్చింది. 250 మంది విద్యార్థులకు వంద మందిలోపే పేరెంట్స్ హాజరయ్యారు. ఆకివీడు జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు పేరెంట్స్ సమావేశం మొదలైంది. కూటమి నేతల రాక కోసం రెండున్నర గంటల పాటు విద్యార్థులు, పేరెంట్స్ వేచి చూడాల్సి వచ్చింది. పాఠశాలలో 400 మంది విద్యార్థులకు వంద మంది పేరెంట్స్ కూడా హాజరుకాలేదు. చాలా హైస్కూళ్లు, ఎంపీపీ, ప్రైమరీ స్కూళ్లలో ఇదే పరిస్థితి. ప్రైవేట్ విద్యాసంస్థలు సొంత నిధులు వెచ్చించాల్సి రావడంతో కొన్ని తరగతులకు చెందిన విద్యార్థులు, వారి పేరెంట్స్‌కు మాత్రమే పీటీఎంలు నిర్వహించగా, మరికొన్ని చోట్ల సమావేశాలు జరిగిన దాఖలాలే లేవు.
ఇవీ మార్గదర్శకాలు
విద్యాశాఖ మార్గదర్శకాల మేరకు పండుగ వాతావరణంలో పీటీఎంలు నిర్వహించాలి. పేరెంట్స్‌కు మహిళలు, పురుషుల విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహించడం, గ్రీన్ పాస్‌పోర్ట్ కింద తల్లి పేరిట ప్రతి విద్యార్థి పెంచే విధంగా ఒక మొక్కను అందజేయడం, వన్–ఆన్–వన్ ఇంటరాక్షన్‌గా విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్, హెల్త్ నివేదికను పేరెంట్స్‌కు వివరించాలి. తల్లులకు విద్యార్థులతో పాదపూజ చేయించాలి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేయాలి.
● హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ
న్యూస్‌రీల్
సమస్యలు నిల్.. ప్రచారం ఫుల్
విద్యార్థుల బంగారు భవిష్యత్తును దిశానిర్దేశం చేస్తూ పేరెంట్స్, టీచర్స్ మీట్ జరగాల్సి పోయి కూటమి నేతల ప్రచార ఆర్భాటానికే అన్నట్టు సమావేశాలు సాగాయి. పాఠశాలల్లోని సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను పక్కనపెట్టి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఈ విద్యా సంవత్సరానికి విడుదల చేసిన తల్లికి వందనం గురించి ప్రసంగాలకే నేతలు పరిమితమయ్యారు. కాగితాలపై ఉపన్యాసాలు రాయించి విద్యార్థులతో చదివించారు. ఇరగవరం మండలం రేలంగిలో జరిగిన పీటీఎంలో తమకు ఆహ్వానం అందలేదంటే, తమకు సమాచారం లేదంటూ కూటమి నేతలు ఒకరి వద్ద ఒకరు అసంతృప్తిని వెళ్లగక్కుకోవడం కనిపించింది. పలుచోట్ల సహపంక్తి భోజనాలు తూతూమంత్రంగానే జరిగాయి. పెనుగొండ మండలంలోని పలు పాఠశాలల్లో పప్పు, సాంబరు వడ్డించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో స్నాక్స్‌తో సరిపెట్టారు. వేండ్రలో భోజనం పాత్రలను విద్యార్థులతో మోయించడం కనిపించింది.
పీటీఎం.. పేలవం
ప్రచార ఆర్భాటంగా పేరెంట్స్ టీచర్స్ మీట్
జిల్లాలో 1,920 ప్రభుత్వ, ప్రాథమిక పాఠశాలలు, 121 జూనియర్ కళాశాలల్లో నిర్వహణ లక్ష్యం
మమ అనిపించిన ప్రైవేట్ విద్యాసంస్థలు
ఎంపీపీ, ప్రాథమిక పాఠశాలల్లో తూతూమంత్రంగా..
చాలాచోట్ల ఉదయం 11 గంటలు దాటినా మొదలుకాని సమావేశాలు
నామమాత్రంగానే తల్లిదండ్రుల హాజరు

మొక్కుబడి తంతు

మొక్కుబడి తంతు

మొక్కుబడి తంతు

మొక్కుబడి తంతు