
జిల్లాస్థాయి కార్యక్రమం.. అపహాస్యం
జీవితాలతో చెలగాటం
అగ్నిమాపక అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రమాదా లను అదుపు చేసే వాహనాలు, సిబ్బంది లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 8లో u
పాలకోడేరు: మండలంలోని భూపతిరాజు సుబ్బ తాతరాజు జెడ్పీ హైస్కూల్‌లో జిల్లాస్థాయిలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్ అపహాస్యం పాలైంది. కార్యక్రమం ఆసాంతం లోటుపాట్లు కనిపించాయి. ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించినా 11.30 వరకూ మొదలుకాలేదు. కలెక్టర్ హాజరైన తర్వాత కూడా ఉపాధ్యాయులు పేరెంట్స్‌కు కబురు పంపారు. అయినా తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో హాజరుకాలేదు. నిన్నటివరకూ వేండ్రలో నిర్వహిస్తారని తమకు తెలియదని, మోగల్లు అని అన్నారని ఉపాధ్యాయులు అన్నారు. జిల్లాస్థాయి కార్యక్రమాన్ని డిప్యూటీ ఎంఈఓ, ఎంఈ పర్యవేక్షించాలి కదా అని కొందరు వ్యాఖ్యానించారు. భోజనాన్ని ప్రత్యేకంగా తయారుచేయించకుండా, రోజూ పాఠ శాలకు వచ్చే ఆహారాన్ని ఎక్కువ స్థాయిలో తీసుకురావడం కనిపించింది. ఆహార పదార్థాల పాత్రలను విద్యార్థులే హైస్కూల్‌లోకి తీసుకురావడం కనిపించింది. తల్లిదండ్రులు, విద్యార్థులు భోజనం తినేందుకు సరైన స్థలం లేక నిలబడే తిన్నారు.
నిర్దేశిత లక్ష్యంతో.. ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ముఖ్య అతిథిగా ఆమె మాట్లాడు తూ జిల్లావ్యాప్తంగా 1,960 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 6 వేల మంది ఉపాధ్యాయులు భాగస్వాములవుతున్నారన్నారు. జిల్లా ఎస్పీ అ ద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆకాంక్షలు అనుగుణంగా విద్యార్థులు కష్టపడి చదివి ప్రయోజకులు కావాలన్నారు. డీఈఓ ఈ.నారాయణ, హెచ్‌ఎం జీవీవీ శ్రీనివాస్ పాల్గొన్నారు.