
కొనలేకపోతున్నాం
మూడు రోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కిలోకు రూ.10 వరకు ఎక్కువగా చెబుతున్నారు. టమాటా గతనెలలో కిలో రూ.16 ఉంటే ఇప్పుడు రూ.36 అమ్ముతున్నారు. దొండ, బెండకాయల ధరలు పెరిగాయి. ముఖ్యంగా పచ్చి మిరప నెల క్రితం కిలో రూ.18 నుంచి రూ.24 మధ్య ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.60కు పైగా అమ్ముతున్నారు.
– గొల్లవిల్లి ఆదిలక్ష్మి, గృహిణి, ఏలూరు
చర్యలు తీసుకోవాలి
మా ఇంటి అవసరాలకు వారానికి సరిపడా కూరగాయలు ఒకేసారి తీసుకుంటాం. ఇప్పుడు పెరిగిన ధరల కారణంగా మరో రూ.200 అధికంగా ఖర్చవుతోంది. ఇది సామాన్యులకు భారం. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కూరగాయల ధరలను తగ్గించే ఏర్పాట్లు చేయాలి. లేదా పేదల కోసం ప్రత్యేక కౌంటర్లలో కూరగాయలు విక్రయించే ఏర్పాట్లు అయినా చేయాలి.
– ముమ్మిన గిరిజ, గృహిణి, ఏలూరు
●

కొనలేకపోతున్నాం