
అదనపు రుసుం అవసరం లేదు
641 కిలోల గంజాయి ధ్వంసం
జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 641 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు వర్గాలు తెలిపాయి. 4లో u
తణుకు అర్బన్: ‘పైసలిస్తేనే మీటర్లు’ శీర్షికన సాక్షి పత్రికలో బుధవారం ప్రచురితమైన కథనానికి విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీరు ఎస్.నరసింహమూర్తి స్పందించారు. తణుకు విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని తణుకు పట్టణం, తణుకు, ఇరగవరం మండలాలకు సంబంధించి విద్యుత్ వినియోగదారులు కొత్త విద్యుత్ సర్వీసుల కోసం వార్డు, గ్రామ సచివాలయాల్లో, మీ సేవా కేంద్రాల్లో అవసరమైన ధ్రువపత్రాలను అందచేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అందుకు సంబంధించి డిపాజట్ మొత్తం ఆన్‌లైన్‌లో జమచేయాలని, వినియోగదారులు అంతకు మించి ఎలాంటి అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరంలేదన్నారు. విద్యుత్ సర్వీసులకు పట్టణ పరిధిలో 24 గంటలు, గ్రామ పరిధిలో 7 రోజుల్లో సర్వీసులు ఇస్తారని చెప్పారు. కొత్త విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు రుసుం చెల్లించిన 30 రోజుల్లో సర్వీసు ఇస్తామని, సర్వీసులకు సంబంధించి పేరు మార్పు, లైన్లు షిప్టింగ్, అదనపు లోడు పెంపునకు సచివాలయాల్లో, మీసేవా కేంద్రాల్లోను దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.