
లారీ ఢీకొని మోటార్‌సైక్లిస్టు మృతి
పాలకోడేరు: లారీ ఢీకొని మోటార్‌సైకిల్‌పై వెళుతున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన గొల్లలకోడేరులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పాలకోడేరు తూర్పు పేటకు చెందిన ఆవాల వెంకటేశ్వరరావు (40) మోటార్‌సైకిల్‌పై గొల్లలకోడేరు వెళ్లి తిరిగి వస్తుండగా గొల్లలకోడేరు బ్రిడ్జి దాటిన వెంటనే ఎదురుగా టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించగా భీమవరం నుంచి వచ్చిన 108 అత్యవసర వాహన సిబ్బంది పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకటేశ్వరరావు భార్య దేవి ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వెంకటేశ్వరరావుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
ఏలూరు టౌన్: ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన మహిళ విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. వివరాల ప్రకారం ఏలూరు బీడీకాలనీకి చెందిన లావేటి సోమేశ్వరరావు, మోహనమ్మకు 2024 ఆగస్టులో వివాహమైంది. కొంతకాలం కాపురం సజావుగా సాగినా అనంతరం ఇద్దరి మద్య విభేదాలతో గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కానీ భర్తను జైలులో పెట్టలేదంటూ ఈనెల 26న మోహనమ్మ జిల్లా జైలు సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలైన ఆమెను ఏలూరు జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మోహనమ్మ మృతిచెందింది.