నాణ్యమైన పరిష్కారం చూపాలి
భీమవరం(ప్రకాశంచౌక్): ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)లో అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జేసీ టి.రాహుల్‌కుమార్ రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారానికి అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. మొత్తం 137 అర్జీలు స్వీకరించారు.
అర్జీల్లో కొన్ని..
● ఆకివీడు మండలం కుప్పనపూడికి చెందిన ఎర్రగోగు రామాంజనేయులు తన భూమిని సర్వే చేయించి హద్దులు చూపాలని కోరారు.
● గణపవరం మండలం కొత్తపల్లికి చెందిన ఆక్వా రైతులు కలవరామ సుబ్బారావు, బొడ్డు అప్పారావు, బి.మధు, తదితరులు గ్రామంలో చేపల చెరువులకు వెళ్లే మార్గం ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశారు.
● అత్తిలి మండలం కంచుమర్రుకి చెందిన ఎం.జయప్రసాద్ గ్రామంలో పంట బోదె పూడుకుపోయిందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
● తాడేపల్లిగూడెంలోని 35 వార్డు చెందిన బండారు పార్వతి తనకు ఒంటరి మహిళ పింఛన్ ఇప్పించాలని అర్జీ అందించారు.
బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
పశ్చిమగోదావరిని బాల కార్మికరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమ వారం కలెక్టరేట్‌లో జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీతో సమావేశమై బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈనెల 30 వరకు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నామన్నారు. జూన్ 5న ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్‌లో అధికారు లకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
కలెక్టర్ నాగరాణి


