
ప్రశాంతంగా ఈఏపీ సెట్
భీమవరం: ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష భీమవరం పట్టణంలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో సోమవారం ప్రశాంతంగా నిర్వహించారు. ఎస్‌ఆర్‌కేఆర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఉదయం 179 మందికి 163 మంది హాజరుకాగా మధ్యాహ్నం 170 మందికి 165 మంది హాజరయ్యారు. విష్ణు ఉమెన్ కళాశాల కేంద్రంలో ఉదయం 87 మందికి ముగ్గురు, మధ్యాహ్నం 87 మందికి ఆరుగురు, విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 110 మందికి 3, మధ్యాహ్నం 110 మందికి 3 విద్యార్థులు గైర్హాజరయ్యారు. డీఎన్నార్ అటానమస్ కళాశాలలో ఉదయం 100 మందికి 95 మంది, మధ్యాహ్నం 100 మందికి 100 మంది హాజరయ్యారు. డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షాకేంద్రంలో ఉదయం102 మంది ఏడుగురు, మధ్యాహ్నం 101 మందికి ఏడుగురు గైర్హాజరయ్యారు.
తాడేపల్లిగూడెంలో..
తాడేపల్లిగూడెం: పట్టణంలోని వాసవీ ఇంజినీరింగ్ కాలేజీలో రెండు పూటలా పరీక్ష నిర్వహించగా 450 మందికి 438 మంది హాజరయ్యారు. శశి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన పరీక్షకు 442 మందికి 430 మంది హాజరయ్యారు.
అమెరికాలో మెరిసిన గోదావరి అమ్మాయి
వీరవాసరం: గోదావరి అమ్మాయి చూర్నిక ప్రియ కొత్తపల్లి, మిస్ తెలుగు యూఎస్‌ఏ 2025 పోటీలో రన్నరప్‌గా నిలిచింది. దీంతో ఆమె స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు శివారు నడపనవారి పాలెంలో ఆనందోత్సాహం నెలకొంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె పీపుల్స్ చాయిస్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ విజయానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కొత్తపల్లి భాస్కర్‌రావు సేవా ట్రస్ట్ అధినేత కొత్తపల్లి రాంబాబు తెలిపారు.
‘పది’ సప్లిమెంటరీ పరీక్షకు 71 శాతం హాజరు
భీమవరం: జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షకు 71 శాతం విద్యార్ధులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. సోషల్ పరీక్షకు 2,329 మంది హాజరుకావాల్సివుండగా 666 మంది గైరహాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నారాయణ తెలిపారు.

ప్రశాంతంగా ఈఏపీ సెట్