
రోడ్డు ప్రమాదంలో సబ్ కలెక్టర్ కార్యాలయ అటెండర్ మృతి
నూజివీడు: నూజివీడు సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న బలుమూరి సుబ్బారావు(59) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. సబ్‌కలెక్టర్‌కు అటెండర్‌గా పనిచేస్తున్న ఆయన స్వగ్రామమైన కృష్ణాజిల్లా గన్నవరం మండలం గోపవారిగూడెంలో ఉంటున్నారు. నిత్యం అక్కడి నుంచే విధులకు హాజరై మరలా ఇంటికి వెళ్తారు. రోజూ మాదిరిగానే ఇంటి వద్ద నుంచి నూజివీడులోని సబ్‌కలెక్టర్ కార్యాలయానికి విధి నిర్వహణ నిమిత్తం మంగళవారం ద్విచక్రవాహనంపై వస్తుండగా ఉదయం 7.45 గంటల సమయంలో కొన్నంగుంట రోడ్డులో అమృతనగర్ స్టేజీ వద్ద వ్యాన్ వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అటెండర్ సుబ్బారావు మృతి వార్త తెలుసుకున్న సబ్‌కలెక్టర్ బచ్చు స్మరణ్‌రాజ్ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం సుబ్బారావు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రూరల్ ఎస్సై జీ జ్యోతీబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలి
బుట్టాయగూడెం: ప్రత్యేక డీఎస్సీ ప్రకటించి ఆదివాసీ ప్రాంతంలో నూరుశాతం ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారంతో 14వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో డీఎస్సీలో ఉపాధ్యాయుల పోస్టులను మినహాయించి ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఆదివాసీ అభ్యర్థులతో ఆ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో తెల్లం లక్ష్మి, కలుం వెంకటేశ్వరి, ఎం శాంతికుమారి, పి.భవాని, పి.నాగరత్నం, జి. కృష్ణారెడ్డి, సీహెచ్ మల్లీశ్వరి, కె.మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో సబ్ కలెక్టర్ కార్యాలయ అటెండర్ మృతి