
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు
కాళ్ల: కూటమి ప్రభుత్వ పాలనలో మాతృమూర్తులకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో మహిళలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో ఎమ్మెల్సీ కవురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందోని మండిపడ్డారు. దేశంలో ఓ పక్క యుద్ధ వాతావరణం నెల కొంటే.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం ప్ర తిపక్ష పార్టీ నాయకులపై కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయడం లేదన్నా రు. మాజీ మంత్రి, బీసీ మహిళపై ఓ సీఐ దౌర్జన్యంగా ప్రవర్తించడాన్ని అందరూ గమనించాలన్నారు. అలాగే ఓ దళిత మహిళను వేకువజామున నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చ ర్యని ఖండించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ కర్ర జయచరిత మాట్లాడుతూ ఎస్సీ మహిళ కల్పనను కనీసం బట్టలు మా ర్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా వేకువ జామున పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉందని, మాజీ మంత్రి విడుదల రజిని ప్రశ్నిస్తే ఆమైపె కూడా కేసు పెడతానని అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మహిళల ను గౌరవిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఎక్కడికి వె ళ్లారని, మహిళలకు రక్షణ కల్పిస్తానన్న డిప్యూటీ సీ ఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీసీ మహిళ, మాజీ మంత్రి విడదల రజినీపై దౌర్జన్యం చేసిన సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ పాలవెల్లి మంగ, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడె విజయలక్ష్మి, పసుపులేటి కుమారి, కోడె యుగంధర్, బి.ఉమామహేశ్వరరావు, ఎం.చిట్టిబాబు, వీర మల్లికార్జునరావు, చిన్న మధు, భీమవరం పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్