శాంతి, భద్రతల పరిరక్షణే లక్ష్యం
భీమవరం: శాంతి, భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనే ప్రథమ కర్తవ్యంగా పోలీ సు అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం భీమవరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన శాంతి భద్రతలపై సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కీలకమైన కేసులు, పాత నేరస్తులు, సస్పెక్ట్ షీట్స్ తదితర అంశాలపై సమీక్షించారు. రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. పోక్సో వంటి కేసుల్లో 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేయాలన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. ముందుగా ఐజీ అశోక్‌కుమార్‌కు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అదనపు ఎస్పీ వి.భీమారావు, డీఎస్పీలు ఆర్.జయసూర్య, జి.శ్రీవేద, డి.విశ్వనాథ్, ట్రైనీ డీఎస్పీ కె.మానస, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశింశెట్టి వెంకటేశ్వరరావు, ఏఆర్ ఇన్‌స్పెక్టర్లు డి.సురేష్, కె.వెంకట్రావు పాల్గొన్నారు.
ఐజీ అశోక్‌కుమార్


