ఆర్జీయూకేటీ విద్యార్థులకు 1,000లోపు 30 ర్యాంకులు
నూజివీడు: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)లో ఆర్జీయూకేటీ పరిధి లోని నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపు ల్ ఐటీల విద్యార్థులు ప్రతిభ కనబర్చారని రిజిస్ట్రా ర్ సండ్ర అమరేంద్రకుమార్ గురువారం తెలిపారు. 400 మంది ఉత్తమ ర్యాంకులు సాధించారని చెప్పారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థి అమిరెడ్డి అశోక్ జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు సాధించాడన్నారు. ఈసీఈ విద్యార్థులు 125, 201, 655, 679, 875, 907 ర్యాంకులు, సీఎస్‌ఈ విద్యార్థులు 182, 241, 298, 308, 342, 475, 663, 680, 724, 783, 844, 915, 983, మెకానికల్ విద్యార్థులు 174, 240, 242, 484, 491, 585, కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 12, 666 ర్యాంకులతో సత్తాచాటారన్నారు. తాము చేపట్టిన గేట్–25 సపోర్ట్ కార్యక్రమమే విజయానికి కారణమని సెంట్రల్ ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ కాంపిటీటివ్ ఎ గ్జామ్ సెల్ కో–ఆర్డినేటర్ ఎం.రామకృష్ణ తెలిపారు. విద్యార్థులతో పాటు శిక్షణకు తోడ్పడిన ఈఐటీపీ సెల్ డీన్ పి.శ్యామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సాయిచరణ్‌కు 9వ ర్యాంక్
కై కలూరు: గేట్ పరీక్షలో కలిదిండి మండలం ఆరుతెగలపాడుకి చెందిన చిలుకూరి సాయి చరణ్ 9వ ర్యాంకు సాధించాడు. చిలుకూరి కిషోర్‌బాబు కుమారుడు చరణ్ కాకినాడ జేఎన్‌టీయూలో ఇంజనీరింగ్ పూర్తిచేసి హైదరాబాద్‌లో గేట్ కోచింగ్ తీసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో 77.67 శాతం మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు.
‘గేట్’లో విద్యార్థుల ప్రతిభ