
కోడ్ ముగిసినా తొలగని ముసుగులు
భీమవరం : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసిన అధికారులు ఎన్నికల కోడ్ ముగిసినా ముసుగులు మాత్రం తొలగించడం లేదు. గత నెలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించగా ఈనెల 4న ఫలితా లు వెల్లడయ్యాయి. కోడ్ ముగిసి రోజులు గడుస్తున్నా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాయకుల విగ్రహాలకు వేసిన ముసుగుల తొలగింపునకు అధికారులు చర్యలు తీసుకోలేదు. కొ న్నిచోట్ల ఫ్లెక్సీలకు వేసిన ముసుగులను ఆయా పార్టీల కార్యకర్తలే తొలగించుకున్నారు.
95.4 శాతం హాజరు
భీమవరం : జిల్లావ్యాప్తంగా 52 కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ ప రీక్షలకు 95.4 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఐఈఓ ఎ.నాగేశ్వరరావు తెలిపా రు. జనరల్ కేటగిరీలో 18,488 మందికి 642 మంది, ఒకేషనల్ కేటగిరీలో 1,754 మందికి 1,483 మంది హాజరయ్యారని చెప్పారు. ఎక్క డా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.
కవయిత్రి మొల్ల జయంతి
భీమవరం (ప్రకాశంచౌక్) : స్థానిక కలెక్టరేట్‌లో గురువారం కవయిత్రి మొల్ల జయంతిని నిర్వ హించారు. జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు కవయిత్రి మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జి.గణపతి రావు, అధికారులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణాలు వేగిరపర్చాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో మే నెలాఖరులోపు 6,319 గృహ నిర్మాణాలను పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ సీ హెచ్ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి గృహ నిర్మా ణ శాఖ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా ఆమె సమీక్షించారు. జిల్లాలో 9,107 నిర్మాణాలకు గాను ఇప్పటికీ 2,788 ఇళ్లను పూర్తి చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయాన్ని విడుదలకు ప్రభు త్వం మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. జి ల్లాలో ఎస్సీ లబ్ధిదారులు 5,593, ఎస్టీ లబ్ధిదారులు 385, బీసీ లబ్ధిదారులు 11,362 మొత్తంగా 18,340 మంది రూ.92.66 కోట్ల మేర లబ్ధి పొందనున్నారన్నారు. జిల్లా హౌసింగ్ అధికారి జి.పిచ్చయ్య, ఈఈ లు, డీఈలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నుంచి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి సస్పెన్షన్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు అసెంబ్లీ ని యోజకవర్గానికి చెందిన పిల్లంగోళ్ల శ్రీలక్ష్మిని వైఎస్సార్‌సీపీ నుంచి సస్పెండ్ చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం గు రువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.
17 నుంచి ఒంటి పూట బడులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈనెల 17 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మ మ్మ ప్రకటనలో తెలిపారు. పాఠశాలలు ఉద యం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పనిచేస్తాయని, పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న చోట మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తరగతులు నిర్వహిస్తారన్నారు.
15న ముఖ్యమంత్రి పర్యటన
భీమవరం (ప్రకాశంచౌక్): తణుకులో ఈనెల 15న ఏర్పాటుచేసిన స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారాన్ని ‘స్వచ్ఛ ఆంధ్ర’ దినోత్సవంగా ప్రకటించి ప్రతి నెలా ఒక్కో జిల్లాలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్నారన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో పర్యటిస్తారన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం–పునర్వినియోగ వ స్తువులను ప్రోత్సహించండి అనే థీమ్‌తో త ణుకులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని కలెక్టర్ తెలిపారు.

కోడ్ ముగిసినా తొలగని ముసుగులు

కోడ్ ముగిసినా తొలగని ముసుగులు