భీమవరం(ప్రకాశం చౌక్): పట్టభద్రుల ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని క లెక్టర్ నాగరాణి రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావ జిల్లాల పట్టభద్రుల ని యోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాపై ఆమె సమీక్షించారు. జాబితాపై అభ్యంతరాలు ంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని, ఈనెల 6వ తేదీతో ఫారం–18, 19 స్వీకరణ గడువు ముగిసిందన్నారు. ఈనెల 20న డ్రాఫ్ట్ రోల్ ప్రచురణ, 23న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటన, నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9 వరకు క్లయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని వివరించారు. జిల్లాలో 67,793 మంది ఓటుకు నమోదు చేసుకున్నారన్నారు. గత ఎన్నికల్లో 65 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ప్రస్తుతం అదనంగా 25 కేంద్రాలు అవసరం ఉంటుందన్నారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.