వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Sep 17 2026 2:20 AM | Updated on Sep 17 2026 2:20 AM

కేంద్రం విడుదల చేసిన అస్యూజ్‌–2025 నివేదికలో వెల్లడి

గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

హనుమకొండలో అత్యధికంగా 1.27 లక్షల మంది..

మహబూబాబాద్‌లో 80,253..

భూపాలపల్లిలో మహిళా కార్మికుల వాటా అధికం

తయారీ, వ్యాపారం, సేవారంగ సంస్థలు పరిగణనలోకి..

ఆరు జిల్లాల్లో 2.56 లక్షల అసంఘటిత సంస్థలు

వరంగల్‌ డెస్క్‌:

మ్మడి వరంగల్‌ జిల్లాలో అసంఘటిత రంగం పెరిగిపోయింది. వ్యవసాయేతర అసంఘటిత రంగంలో ఆరు జిల్లాల పరిధిలో కలిపి సుమారు 3.48 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) చేపట్టిన వార్షిక సర్వే అస్యూజ్‌–2025లో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ సర్వే నివేదికను వెల్లడించింది. ఈ నివేదికలో జిల్లాల వారీగా అసంఘటిత సంస్థలు, కార్మికుల వివరాలు పొందుపర్చారు. ఈ నివేదికలోని జిల్లాల అంచనాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలిపి రూపొందించినట్లు పేర్కొంది. అసంఘటిత సంస్థల్లో హనుమకొండ జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత మహబూబాబాద్‌ నిలిచింది. మొత్తం ఆరు జిల్లాల్లో కలిపి 2.56 లక్షల అసంఘటిత సంస్థలు ఉన్నట్లు అంచనా వేశారు.

ఉమ్మడి వరంగల్‌లో అసంఘటిత కార్మికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement