ఖిలా వరంగల్: ధాన్యం మిల్లింగ్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై రైస్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11 నుంచి పూర్తిస్థాయిలో నిరవధికంగా రైస్ మిల్లులను బంద్ చేసి సమ్మె బాట పట్టారు. దీంతో జిల్లాలోని 102 రైస్ మిల్లులు మూతపడ్డాయి. సమస్యలు పరిష్కరించే వరకు మిల్లులు తెరిచేది లేదని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 149 రైస్ మిల్లులుండగా 47 మిల్లులు వివిధ కారణాలతో మూతపడగా.. 102 మిల్లులు నడుస్తున్నాయి. అవి కూడా నిరవధికంగా మూతపడ్డాయి.
సమస్యలు ఇలా..
● ధాన్యం కేటాయించిన 15 రోజుల్లోనే ప్రభుత్వం బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది. మిల్లర్లతో ప్రభుత్వం చేసే ఒప్పందంలో ఈ అంశం స్పష్టంగా ఉంటుంది. కానీ, ఎక్కడా 15 రోజుల్లో తీసుకున్న ఘటనల్లేవు. సాధారణ పరిస్థితుల్లో ఏడాది వరకు ప్రభుత్వం సమయం తీసుకుంటోంది. దీంతో ధాన్యంలో తరుగు పెరుగుతోంది.
● ప్రస్తుతం క్వింటా ధాన్యానికి 65.5 కిలోల బియ్యం ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాలి. అయితే, సన్నధాన్యం 63 కిలోలకు మించి రావడంలేదు. ఈ పరిమాణాన్ని 62 కిలోలకు తగ్గించాలని మిల్లర్లు కోరుతున్నారు.
● కేంద్రం ఇచ్చే తరుగును రాష్ట్ర ప్రభుత్వం మిల్ల ర్లకు ఇవ్వకపోవడం, గడిచిన 8 సీజన్లకు సంబంధించి మిల్లింగ్ చార్జీలు చెల్లించకపోవడం వంటి సమస్యలున్నాయి.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నిరవధిక బంద్‌తో జిల్లాలో
మూతపడిన 102 మిల్లులు
నిబంధనలు సడలించాలి
సీఎంఆర్ ఒప్పదం ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా రూపొందించాలి. రన్నింగ్ మిల్ల ర్లపై వేసిన కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలి. క్వింటా ధాన్యానికి మిల్లింగ్ చార్జీ రా బియ్యానికి రూ.150, బాయిల్డ్ బియ్యానికి రూ.200లకు పెంచాలి.మిల్లింగ్ క్రమంలో 100 శాతానికి డ్యామేజ్, నూకలు, పరం సుమారు 15 నుంచి 20శాతం వరకు వచ్చే తరుగును పరిగణలోకి తీసుకోవాలి.
– గోనెల రవీందర్, జిల్లా అధ్యక్షుడు,
రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్


