కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ: పారదర్శకంగా, వేగంగా ఎస్‌ఐఆర్‌ను పూర్తిచేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని కనకదుర్గ కాలనీ, వడ్డేపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సుధానగర్ బాలుర హాస్టల్‌లోని పోలింగ్ కేంద్రాల్లో సర్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. వరంగల్ పశ్చిమ ఈఆర్‌ఓ, హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్, హనుమకొండ ఏఈఆర్‌ఓ, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రత్యేక ప్రచార కార్యక్రమం పరిశీలన
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని (స్పెషల్ క్యాంపెయిన్)ను అదనపు కలెక్టర్ ఎన్.రవి శనివారం పరిశీలించారు. వడ్డేపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 182, 184 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్‌ఓ సూపర్‌వైజర్ కరుణాసాగర్, బీఎల్‌ఓలు జ్యోతి, శ్రీలత పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: టీఎన్జీఓస్ యూనియన్ ఇంటర్ ఎడ్యుకేషన్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ ఫోరం హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి పనికల రాజేశ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా జి.నవీన్‌కుమార్, కార్యదర్శిగా జి.విజేందర్, ఉపాధ్యక్షులుగా ఎల్.సునీత, ఎ.రంజిత్‌రెడ్డి, వసీ మునీసా, కోశాధికారిగా శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శులుగా వి.సంతోశ్‌కుమార్, బి.శ్వేత, సాయి వినీత్, ప్రచార బాధ్యుడిగా జి.శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎం.భరత్, హెచ్.సత్యం, కార్యవర్గ సభ్యులుగా బి.రేణుక, సాత్విక, పి.పద్మను ఎన్నుకున్నారు. జిల్లా జేఏసీ చైర్మన్, టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, గౌరవ అధ్యక్షుడు శ్యాంసుందర్, రాజేశ్ ఖన్నా, రామాంజనేయులు, ప్రణయ్, ఎం.శివ, బి.రవిశంకర్, ఎం.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


