లోక్‌ అదాలత్‌కు విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌కు విశేష స్పందన

Sep 13 2026 12:42 AM | Updated on Sep 13 2026 12:42 AM

వరంగల్‌ లీగల్‌: వరంగల్‌, హనుమకొండ జిల్లాల పరిధి జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్లు బీవీ.నిర్మలా గీతాంబ, యం.రామకృష్ణ సునీత ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మూడో జాతీయ లోక్‌ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో మొత్తం 21 బెంచ్‌లు ఏర్పాటు చేసి 1,254 పెండింగ్‌ కేసులు పరిష్కరించారు. వరంగల్‌ జిల్లాలో 9 బెంచ్‌ల ద్వారా 520 కేసులు, హనుమకొండ జిల్లాలో 12 బెంచ్‌ల ద్వారా 734 కేసులకు పరిష్కారం లభించింది. వరంగల్‌ జిల్లాలో పరిష్కరించిన కేసుల్లో 64 సివిల్‌, 53 ఎంవీఓపీ, 11 ఇతర సివిల్‌, 456 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఎంవీఓపీ కేసుల్లో మొత్తం రూ.6,72,17,640 పరిహారం చెల్లింపునకు పరిష్కారం చూపారు. అదేవిధంగా 26 బ్యాంకు పీఎల్‌సీ, 6 బీఎస్‌ఎన్‌ఎల్‌ పీఎల్‌సీ, 63,002 ట్రాఫిక్‌ఈ–చాలన్‌ కేసులు, 19 సైబర్‌ క్రైమ్‌ కేసులను పరిష్కరించారు. హనుమకొండ జిల్లాలో 56 సివిల్‌, 47 ఎంవీఓపీ, 678 క్రిమినల్‌ కేసులు పరిష్కరించారు. ఎంవీఓపీ కేసుల్లో రూ.61,25,961 పరిహారానికి పరిష్కారం లభించింది. 41 బ్యాంకు పీఎల్‌సీ, 17 విద్యుత్‌ పీఎల్‌సీ, 36,622 ట్రాఫిక్‌ ఈ–చాలన్‌, 18 సైబర్‌ క్రైమ్‌ కేసులను పరిష్కరించారు. కార్యక్రమంలో సీపీ శ్వేత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ, హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి రామలింగం, న్యాయమూర్తులు, జిల్లాల న్యాయవాదుల సంఘం అధ్యక్షులు సీహెచ్‌.ఉపేందర్‌, సీహెచ్‌.రామకృష్ణ, డీసీపీ దార కవిత, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చకిలం ఉపేందర్‌, చొల్లేటి రామకృష్ణ, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement