ఎస్‌ఐఆర్‌ నోటీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ విధానం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌ నోటీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ విధానం పరిశీలన

Sep 13 2026 12:42 AM | Updated on Sep 13 2026 12:42 AM

ఖిలా వరంగల్‌: వరంగల్‌లోని ఆటోనగర్‌, శివనగర్‌, మామునూరులోని పోలీంగ్‌ స్టేషన్లలో సర్‌ ప్రక్రియ స్పెషల్‌ క్యాంపెయిన్‌ కేంద్రాలను ఆర్డీఓ సుమతో కలిసి కలెక్టర్‌ సత్యశారద పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో ఓటర్ల వివరాలు, స్వీకరిస్తున్న అభ్యంతరాలు, దరఖాస్తుల ప్రక్రియపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌–2026 ప్రక్రియలో భాగంగా ఓటర్ల నుంచి వచ్చే ప్రతీ అభ్యంతరం, దరఖాస్తును నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు శ్రీకాంత్‌, ఇక్బాల్‌, డీఏఓ ఫణికుమార్‌ పాల్గొన్నారు.

సర్‌ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలి

నల్లబెల్లి: సర్‌ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని డీఆర్‌డీఓ నాగపద్మజ అన్నారు. నల్లబెల్లి, మేడపల్లి, నారక్కపేట గ్రామాలను శనివారం ఆమె సందర్శించి సర్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనామలీస్‌, నో మ్యాపింగ్‌ కేటగిరిలో గుర్తించిన ప్రతీ ఓటరుకు నోటీస్‌ అందించి పారదర్శకంగా విచారణ కొనసాగేందుకు బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు పాటించాల్సిన జాగ్రత్తలను విరించారు. ప్రతీ కేసుకు సంబంధించిన ధ్రువపత్రాలు క్షుణంగా పరిశీలించాలని తహసీల్దార్‌ ముప్పు కృష్ణకు సూచించారు.

కలెక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement