వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, కలెక్టర్లు
సత్యశారద, చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: గణపతి విగ్రహాల నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కాజీపేట బంధం చెరువు, హనుమకొండ సిద్ధేశ్వర గుండం, వరంగల్ చిన్న వడ్డేపల్లి, ఉర్సు చెరువుల వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను శుక్రవారం వారు పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని వారు సూచించారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్‌రావు, జీడబ్ల్యూఎంసీ ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈలు రవికుమార్, సంజయ్ కుమార్, హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్, డీఎంహెచ్‌ఓలు అప్పయ్య, రాజారెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సామ్యానాయక్, సాగునీటి పారుదల శాఖ అధికారులు కిరణ్‌కుమార్, మధుసూదన్‌రెడ్డి, జీడబ్ల్యూఎంసీ ఎంహెచ్‌ఓ రాజేశ్, ఆర్‌అండ్‌బీ ఈఈ దేవికాచౌహాన్, మైనింగ్ ఏడీ రామాచారి, కాజీపేట తహసీల్దార్ రాజు, ఏసీపీలు ప్రశాంత్‌రెడ్డి, సత్యనారాయణ, కాజీపేట పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్యాం సుందర్ పాల్గొన్నారు.


