ఎల్కతుర్తి: అండర్‌పాస్ నిర్మాణానికి మండలంలోని సూరారం వద్దగల ఎన్‌హెచ్–563ను శుక్రవారం జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) కృష్ణారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఎస్సై నరసింహారావు పరిశీలించారు. సూరారం జంక్షన్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాలు, ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు అండర్‌పాస్ నిర్మించాలంటూ స్థానికులు అధికారులను కోరారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అండర్‌పాస్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక నివేదికను, రోడ్డు మళ్లింపు ప్రణాళికను త్వరలోనే సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. అండర్‌పాస్ నిర్మాణ పనులు జరిగే సమయంలో ఇటు వాహనాదారులు, అటు స్థానికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సర్వీస్ రోడ్ల అభివృద్ధి, ప్రత్యామ్నాయ మార్గాలపై సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు.


