నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ అందించాలి | - | Sakshi
Sakshi News home page

నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

Sep 12 2026 1:42 AM | Updated on Sep 12 2026 1:42 AM

నర్సంపేట: వినియోగదారులకు నాణ్యమైన విద్యు త్‌ అందించాలని టీజీఎన్పీడీసీఎల్‌ సీఈ ఎంఆర్‌టీ అన్నపూర్ణ అన్నారు. నర్సంపేట టోని 132కేవీ సబ్‌ స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మీకంగా తనిఖీ చేశారు. విద్యుత్‌ సరపరా స్థితిగతులపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ, వినియోగదారులకు నాణ్యమై న, నమ్మకమైన విద్యుత్‌ సరఫరా అందించేందుకు చర్యలను శుక్రవారం పరిశీలించారు. సబ్‌ స్టేషన్‌లోని విద్యుత్‌ పరికరాల పనితీరు, లోడ్‌ పరిస్థితి, ఫీడర్ల ద్వారా కొనసాగుతున్న సరఫరా స్థితిగతులను పరిశీలించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా పరికరాల పరితీరును నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. సబ్‌ స్టేషన్‌లో భద్రతా ప్రమాణాలను పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. డీఈ తిరుపతి, ఏడీఈ పాల్గొన్నారు.

వినియోగదారులకు అందుబాటులో ఉండాలి

వర్ధన్నపేట: విద్యుత్‌ సిబ్బంది నిరంతరం వినియోగదారులకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందించాలని విద్యుత్‌ సీఈ(ఆపరేషన్స్‌) గౌతంరెడ్డి అన్నారు. శుక్రవారం వర్ధన్నపేటలోని సబ్‌ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేశారు. విద్యుత్‌ అధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో విద్యుత్‌ వినియోగం పెరిగిందన్నారు. విద్యుత్‌ సమస్యలు ఏర్పడినపుడు వినియోగదారులకు అందుబాటులో ఉండి సమస్యలను తీర్చాలని ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రైతులు, విద్యుత్‌ వినియోగదారులకు అవసరమైన సేవలు అందించేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలన్నారు ఏడీఈ నటరాజ్‌, ఏఈ తరుణ్‌, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సబ్‌ స్టేషన్‌ తనిఖీ

పర్వతగిరి: మండ కేంద్రంలోని 33/11కేవీ సబ్‌ స్టేషన్‌ను శుక్రవారం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌(ఆపరేషన్‌) వరంగల్‌ ఆనందం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టెక్నికల్‌ సమస్యలు, సాంకేతిక లోపాలు తలెత్తితే తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆనందం సూచించారు. కార్యక్రమంలో ఏడీఈ తిరుపతి, విద్యుత్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement