ట్రాఫిక్‌ పీఎస్‌ను తనిఖీ చేసిన సీపీ | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ పీఎస్‌ను తనిఖీ చేసిన సీపీ

Sep 12 2026 1:42 AM | Updated on Sep 12 2026 1:42 AM

కాశిబుగ్గ: వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్‌ ట్రాపిక్‌ పోలీస్‌ స్టేసన్‌ను పోలీసు కమిషనర్‌ ఎన్‌.శ్వేత శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బంది కిట్‌, ఆర్టికల్స్‌ను పరిశీలించారు. శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌లోని వివిధ రికార్డులు పరిశీలించారు. వాహనాల తనిఖీలు, ట్రాఫిక్‌ నిబంధనల అమలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట అదనపు డీసీపీ ప్రభాకర్‌రావు, ఏసీపీ సత్యనారాయణ, సీఐ సుజాత, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement