శాంతిభద్రతలను పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలను పరిరక్షించాలి

Sep 11 2026 11:15 AM | Updated on Sep 11 2026 11:15 AM

శాంతిభద్రతలను పరిరక్షించాలి

ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌

దామెర: శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌ శంక్వర్‌ ఆదేశించారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్‌స్టేషన్‌ పరిసర ప్రాంతాలు, పలు రికార్డులు పరిశీలించారు. కేసుల దర్యాప్తు, పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి, స్టేషన్‌ నిర్వహణపై ఎస్‌హెచ్‌ఓను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలని పేర్కొన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆయన వెంట పరకాల ఏసీపీ సతీశ్‌బాబు, పరకాల రూరల్‌ సీఐ వై.సుధాకర్‌రెడ్డి, ఎస్సై ఇమ్మడి వీరభద్రరరావు, పోలీస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement