● డీపీఓ లక్ష్మీ రమాకాంత్
ఆత్మకూరు: వీబీజీ రాంజీ పథకంలోని పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్ అన్నారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా కాంపౌండ్, మ్యాజిక్ సోక్‌పిట్లపై ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడారు. గ్రామపంచాయతీల వారీగా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి గ్రామపంచాయతీలో విధిగా రెండు ఫాంపాండ్‌లను నిర్మించాలని సూచించారు. గ్రామాల్లో క్షేత్రస్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల భాగస్వామ్యంతో పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, డీఎల్‌పీఓ రవిబాబు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


