● డీఈఓ గిరిరాజ్ గౌడ్
ఆత్మకూరు: ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్, గొల్లవాడ ప్రాథమిక పాఠశాల, తిరుమలగిరిలోని కేజీబీవీని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు విద్యార్థుల విద్యాప్రగతి, బోధనా విధానం అమలు వివరాలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న హాజరు రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. అలాగే, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం డీఈఓ గిరిరాజ్‌గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, పాఠశాల రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్‌ఎం నిర్మలకుమారి, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం పెండెం రాజు పాల్గొన్నారు.


