సంగెం: అధికారుల తప్పిదం తనకు శాపంగా మారిందని, తన పేరుపై వచ్చిన ఇందిరమ్మ ఇంటి బిల్లు ఇతరులకు ఇప్పించారని ఓ బాధితురాలు.. ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతోత్ హుస్సేన్ నాయక్‌కు బుధవారం ఫిర్యాదు చేసింది. బానోతు భద్రు భార్య విజయ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బిక్కోజినాయక్ తండాకు చెందిన బానోత్ విజయ భర్త భద్రు, బానోత్ విజయ భర్త ఈర్యా ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే విజయ, ఈర్యా దంపతులకు ఇళ్లు మంజూరైందని చెప్పి భద్రు భార్య విజయ అకౌంట్‌లో జమ అయిన ఇంటి బిల్లును సర్పంచ్ లక్ష్మణ్, ఇందిరమ్మ కమిటీ బాధ్యులు వారికి ఇప్పించారు. తనకు మంజూరైన బిల్లు ఇతరులకు ఇవ్వడం వల్ల భవిష్యత్‌లో ప్రభుత్వం నుంచి మళ్లీ ఇళ్లు మంజూరు కాదని తెలుసుకున్న భద్రు భార్య విజయ ఎంపీడీఓ, కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరింది. ఈ విషయంపై హుస్సేన్‌యక్‌కు కూడా వినతిపత్రం ఇవ్వడంతో విచారణ చేసి విజయకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.


