భీమదేవరపల్లి : ముల్కనూరు కోఆపరేటివ్ రూరల్ క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ మారుపాటి రాంరెడ్డి సీడ్స్‌మెన్ వార్షిక అవార్డ్స్–2026 పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం సీడ్స్‌మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. విత్తన రంగంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం, సహకార వ్యవస్థ ద్వారా కర్షకుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించడం, సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ఆయన చేసిన కృషిని గుర్తించి ఎస్కేఎల్‌టీజీహెచ్‌యూ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ రాజిరెడ్డి, టీఎస్‌ఎస్‌ఓసీఏ డైరెక్టర్ డాక్టర్ కిరణ్ కుమార్, సీడ్స్‌మెన్ అసోసియేషన్ అధ్యక్షుడు జీఎన్‌వీ.రామకృష్ణ, కార్యదర్శి రఘువాసు ఈ పురస్కారాన్ని బుధవారం అందించారు.


