● డీఈఓ గిరిరాజ్ గౌడ్
శాయంపేట: ఉపాధ్యాయులు విద్యతో పాటు మానవతా, నైతిక విలువలు కూడా బోధించాలని హనుమకొండ డీఈఓ గిరిరాజ్ గౌడ్ ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం పత్తిపాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను, మండల కేంద్రంలోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా పాఠశాలలోని రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ముందుండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ మన్మోహన్, ప్లానింగ్ అధికారి మహేశ్, ఎంఈఓ గడ్డం భిక్షపతి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాధవి, శ్రీనివాస్, శ్రీలత, అశోక్, సీఆర్పీలు అశోక్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు అంజనీదేవి, శ్రీనివాస్, రఘు, రమ, విజయ, విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.


