పోచమ్మ బోనాలు ఇక్కడ ప్రత్యేకం | - | Sakshi
Sakshi News home page

పోచమ్మ బోనాలు ఇక్కడ ప్రత్యేకం

Sep 10 2026 3:38 AM | Updated on Sep 10 2026 3:38 AM

నేడు న్యూశాయంపేట ఊరంతా వేడుక

కాజీపేట అర్బన్‌: న్యూశాయంపేటలో శ్రావణమాసం ఆఖరి గురువారం రోజున పోచమ్మతల్లి బోనాలను నిర్వహించుకోవడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ నెల 10న శ్రావణమాసం చివరి గురువారం కావడంతో పోచమ్మతల్లి బోనాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు.

ఊరంతా బోనాల పండుగ

గ్రేటర్‌ వరంగల్‌ 31వ డివిజన్‌లోని న్యూశాయంపేటలో కులమతాలకు అతీతంగా జాతరను తలపిస్తూ పోచమ్మతల్లి బోనాలను గురువారం నిర్వహించుకుంటారు.

కుమ్మరులే పూజారులు

న్యూశాయంపేటలో నిర్వహించే పోచమ్మతల్లి బోనాలకు అనాదిగా కుమ్మరులు (శాలివాహనులు) పూజారులుగా, పోచమ్మతల్లికి యాదవుల మేకపోతుల బండి రథంగా కొనసాగుతూ వస్తోంది. ప్రధాన రహదారి నుంచి దేవాలయం వరకు మేకల బండిలో పోచమ్మతల్లి ప్రతిమను ఉంచి డప్పుచప్పుళ్లు శివసత్తులు, పోతరాజుల విన్యాసాలతో మధ్య ఊరేగిస్తారు. భక్తులు నృత్యాలు చేస్తూ పోచమ్మకు బోనాలు సమర్పిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement