యూరియా కోసం రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం రైతుల ఆందోళన

Sep 8 2026 1:05 AM | Updated on Sep 8 2026 1:05 AM

ఖానాపురం: యూరియా కోసం రైతులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు సోమవారం ఖానాపురం రైతువేదిక వద్దకు పలు గ్రామాలకు చెందిన భూముల పట్టాలు లేని రైతులు గంగయ్య, విష్ణు, ఈర్య, సాయిలు, సరోజన, సాంబలక్ష్మి, సమ్మక్క, భద్రమ్మ, యాకాంబ్రం, ఉపేంద్ర, ఐలయ్య, దసృ, రాజమ్మ, కొంరుమల్లు చేరుకోని వ్యవసాయ అధికారులను నిలదీశారు. యాప్‌లో పట్టాలు లేని రైతులకు రావడంలేదని, ఇందులో తాము చేసేదేమీలేదని వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌, విస్తరణ అధికారి ఆశాదీప్‌లు తెలిపారు. దీంతో ఏఈఓతో రైతులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ నిబంధనలు ఇంకా రాలేదని చేతులెత్తి మొక్కుతూ ఏఈఓ ఆశాదీప్‌ రైతులకు చెప్పినా వినకుండా వాగ్వాదం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రతీ రైతుకు యూ రియా అందించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement