కాశిబుగ్గ: శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్న దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్‌లో కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అనంతరం మధు దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయనపై బీఆర్‌ఎస్ తక్షణమే చర్యలు తీసుకోవాలని, స్పీకర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొరివి పరమేష్, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


