● జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కృష్టారావు
కమలాపూర్: విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కృష్టారావు సూచించారు. కమలాపూర్ పీహెచ్‌సీ ఆధ్వర్యంలో స్థానిక పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌లో జాతీయ పోషకాహార వారోత్సవం సందర్భంగా ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు, సమతుల్య పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవనశైలి తది తర అంశాలపై సోమవారం అవగాహన కల్పించా రు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, రికార్డుల నిర్వహణను ప రిశీలించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి నాగరాజు, డా క్టర్ అరుణ్‌కుమార్, హెచ్‌ఈఓ రవీందర్ ఉన్నారు.


