ఆత్మకూరు: ఈఫొటోలోని మహిళ పేరు తనుగుల రాధిక. గ్రామం ఆత్మకూరు, ఈమెకు గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉత్తర్వులు గృహలక్ష్మిలో గృహనిర్మాణం చేసుకోవడానికి వచ్చాయి. దీంతో గృహ నిర్మాణాన్ని ప్రారంభించి బెడ్, పిల్లర్ వరకు నిర్మాణం చేపట్టింది. బిల్లులు రాకపోవడంతో అప్పులయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వమే మంజూరు చేసిన ఇంటికి ప్రభుత్వం బిల్లులు ఆపడం ఎంత వరకు కరెక్ట్ అని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. బిల్లు ఇప్పించాలని సోమవారం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంది.
గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలి..
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
సమస్యలకు పరిష్కారం చూపాలని అర్జీదారుల మొర


