ఖిలా వరంగల్: వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి, రైతు సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం, లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్యశారదతో కలిసి మంత్రి సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం మార్కెట్‌లో ఆధునిక సౌకర్యాలు కల్పించిందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో క్రయవిక్రయాల్లో భద్రత ఉంటుందని వివరించారు. మార్కెట్‌లో 100 సీసీ కెమెరాలు, లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ ఏనుమాముల పోలీస్ స్టేషన్ భవన మంజూరు కోసం త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా మార్కెట్ అధికారి కె.సురేఖ, కార్యదర్శి మల్లేశం, చాంబర్ ఆఫ్‌కామర్స్ వరంగల్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, కార్యదర్శి మాడూరి వేదప్రకాశ్, జాయింట్ సెక్రటరీ సాగర్ల శ్రీనివాస్, కాటన్ సెక్షన్ అధ్యక్షుడు వీరారావు, గ్రేడ్–2 కార్యదర్శి రాము, సహాయ కార్యదర్శి అశోక్, శ్రీనివాస్, గులామ్ సర్వమున్నా, బాబురావు, కార్పొరేటర్లు అనిల్, సోమిశెట్టి ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ రమేష్ పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు
సీసీ కెమెరాలు దోహదం
రాష్ట్ర అటవీ, పర్యావరణ,
దేవాదాయ శాఖ మంత్రి సురేఖ


