నర్సంపేట రూరల్: ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. నర్సంపేట పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన పొన్నాల శివశంకర్, అతని భార్య రేణుక, పర్ని అశోక్‌కు పలు వాహనాలు దొంగతనాలకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించగా వారి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. కార్యక్రమంలో టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రవికుమార్, గూడ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.


