బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి | - | Sakshi
Sakshi News home page

బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి

Mar 31 2026 7:44 AM | Updated on Mar 31 2026 7:44 AM

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

ఖిలా వరంగల్‌: బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. గుంటూరుపల్లి ప్రాథమిక పాఠశాలలో యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ వరంగల్‌, పోలీస్‌ కమిషనరేట్‌, ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ సంయుక్తంగా మామునూరు సబ్‌డివిజన్‌ ఏసీపీ వెంకటేష్‌, హెచ్‌ఎం విద్యాసాగర్‌ అధ్యక్షతన ఇటుక బట్టిల్లో పనిచేసే వలస కార్మికుల పిల్ల లకు విద్యా సామగ్రి, యూనిఫామ్‌ను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ ఏడాది ఆపరేషన్‌ స్మైల్‌, ఆపరేషన్‌ ముస్కాన్‌ అనేది పోలీస్‌, వివిధ ప్రభుత్వశాఖల సమన్వయంతో చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ ఎన్‌.రవి, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ ఇన్‌స్పెక్టర్‌ జె.శ్యాం సుందర్‌, ఎస్సైలు సుధాకర్‌, శ్రీకాంత్‌, గుంటూరుపల్లి సర్పంచ్‌ శ్రీకాంత్‌, ఉప సర్పంచ్‌ దండు నరేష్‌, బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్‌, కుమ్మరి రవికుమార్‌, డాక్టర్‌ అనంద్‌, వసుధ, డీసీపీఓ ఉమ, శిరీష, తదితరులు పాల్గొన్నారు.

కళానైపుణ్యాలను పెంచేది ‘రంగస్థలం’

రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు తిరుమలయ్య

హన్మకొండ కల్చరల్‌: కళాకారుల ప్రతిభను వె లికితీసి వ్యక్తిత్వం, కళానైపుణ్యాలను పెంచేది రంగస్థలమని రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కాజీపేట తిరుమలయ్య అన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి వరంగల్‌లోని పోతనవిజ్ఞానపీఠంలో రెండురోజుల పాటు జరిగే పీఠం వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గందె శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా తిరుమలయ్య, విశిష్ట అతిథిగా కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, యేర కోటేశ్వరరావు, నేరెళ్ల శోభావతి, పీఠం మేనేజర్‌ జేఎన్‌ శర్మ పాల్గొని మాట్లాడారు. అనంతరం రంగస్థల కళాకారులను సన్మానించారు. మయూరి ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ వరంగల్‌ ప్రదర్శించిన ‘వివాహబంధం’ నాటిక అలరించింది. ఈ నాటికలో మాడిశెట్టి రమేశ్‌, సాదుల సురేశ్‌, కొడం సురేందర్‌, వేముల ప్రభాకర్‌, ఆకుతోట లక్ష్మణ్‌ నటించారు. సురభి సంతోష్‌ రంగాలంకరణ చేయగా, సంగీతం పాక సృజన్‌ అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement