● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: సోషల్ మీడియా ద్వారా మేలుకంటే కీడు ఎక్కువగా జరుగుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అసెంబ్లీ సమావేశాల్లో అన్నారు. తాను ఇటీవల రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణతో పాల్గొంటే దానిపైన సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుందన్నారు. మహిళలపై విచక్షణ కోల్పోయి అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, ఇటువంటి చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా మరింత క్రమశిక్షణతో పని చేస్తూ వర్ధన్నపేట ప్రజల సంక్షేమం కోసం దృఢ సంకల్ప ంతో ముందుకు సాగుతున్నానన్నారు.


